గజ్జె ఘల్లు మన్నదో గుండే ఝల్లు మన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమషా ఆ..
ఇచ్చుకో ఒడే మజాగా..
లేత చీకట్లో నీ ఒల్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పురేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో
చిన్నింటిలో జున్నంటుకో ....
||గజ్జె ఘల్లు||
వంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనె సంపంగి కంచాలు
ఒల్లంటుకుంటేనె జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో
ఉత్తమైన గుమ్మ౦దమూ వత్తుకున్న వడ్డాణము గంట కొట్టె కౌగిళ్ళలోనా
మువ్వ గోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వు జివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో
||గజ్జె ఘల్లు||
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మ లాడేను నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లొ ఛీ పోలు రేగేను నా పూల సంతల్లో
కొండమ్మ కొనమ్మ కోలాటమాడెను నీ రూపురే్ఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచుపుల్లో
పంచదార పందిళ్ళలో మంచు తేనె సందిళ్ళలో పాలు పంచుకోరా నా ప్రాయం
వంగ తోటెంతో బావుంది వయ్యారి వడ్డీలు చెల్లించి పో
కొత్త కవ్వి౦త పుట్టించి గల్ల౦తు చేసేసి వేడిక్కి పో
వేదించుకో వేటాడుకో..
||గజ్జె ఘల్లు||
No comments:
Post a Comment