22 June 2010

అభినవ తారవో...నా...అభిమాన తారవో

అభినవ తారవో...నా...అభిమాన తారవో
అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కంతిధారవో
మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీ

అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చెరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావన హరినమ్ములా

అభినవ తారవో

ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు

అభినవ తారవో

నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా...నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ

నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను..నీ ప్రియభక్తడను

అభినవ తారవో

No comments:

Post a Comment