11 June 2010

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

మనముండే చోటు ఏకాంత ద్వీపం ఎవ్వరికి అనుమతి లేదంటా
ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు చిరునామా ఇంటికి వలదంట
నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి
ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి
ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా
ఏమో నా హృదయం పొంగింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి నిద్దురను కలచి వెయ్యొద్దు
పదమేమో నీది పాదాలు నావి పయనాన్ని ఆపి వెయ్యొద్దు
నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా
నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా
ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం
కలలన్ని నిజమే చేసేద్దాం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

No comments:

Post a Comment