22 June 2010

మబ్బు లో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది

మబ్బు లో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది
మబ్బు లో కన్నీరు నీ మనసు లో పన్నిరు నీ మనసు లో పన్నీరు..అవునా...

తోటలో ఏముంది నా మాట లో ఏముంది నా మాట లో ఏముంది
తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు నీ మాట లో తేనియలు

చేను లో ఏముంది నామేను లో ఏముంది నామేను లో ఏముంది
చేను లో బంగారం నీ మేను లో సింగారం నీ మేనులో సింగారం

ఏటి లో ఏముంది నా పాట లో ఏముంది నా పాటలో ఏముంది
ఏటి లో గలగలలు నీ పాట లో సరిగమలు నీ పాట లో సరిగమలు

నేను లో ఏముందీ నీవు లో ఏముంది నీవులో ఏముంది
నేను లో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది

నేను లో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేను లో నీవుంది

No comments:

Post a Comment