22 June 2010

చిలిపి కన్నుల తీయని చెలికాడ

చిలిపి కన్నుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా వెలుగుల మేడా
నీలి కురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాలా

కనుల ముందు అలలు పొంగెను ఓ... మనసులోనె కలలు పండెను
అలలే కలై కలలే అలలై గిలిగింతలు సలుప సాగెను..ఊ..
చిలిపి కన్నుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందును రా వెలుగుల మేడా

కొండలు ఓయి అని పిలిచినవి ఆ ... గుండెలు హోయి అని పలికినవి
కోరికలు అన్ని దారులు తీరి గువ్వలు గా ఎరుగుతున్నవి
నీలి కురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాలా

జగము మరిచి ఆడుకుందుమా ...ఆ ప్రణయ గీతి పాడుకుందుమా
నింగి నేల కలిసిన చోటా నీవు నేను చేరుకొందమా ఆ...

No comments:

Post a Comment