నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన యూరెడి వువ్విళ్ళో ||2||
నెయ్యములల్లో నే..రే..ళ్ళో
పలుచని చెమటల బాహు మూలముల-
చెలమలలో నా చెలువములే ||2||
తళతళ మను ముత్యపు చెఱగు సురటి
దులిపెడి నీళ్ళ తుంపిళ్ళో
||నెయ్యములల్లో||
తొటతొట కన్నుల దొరిగెడి నీళ్ళ
చిటిపొటి అలుకలు చిరు నగవే ||2||
వటఫలంబు నీ వన్నెల మోవికీ..ఆ..
వటఫలంబు నీ వన్నెల మోవికీ
గుటుకలలో నా గ్రుక్కిళ్ళో
||నెయ్యములల్లో||
గరగరికల వేంకటపతి కౌగిట..వేంకటపతి కౌగిట
గరగరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు ||2||
మరుని వింటి కమ్మనియంప విరుల-
గురి తాకు ఇనుప గుగ్గిళ్ళో
||నెయ్యములల్లో||
నాగేశ్వరరావు గారూ,
ReplyDeleteఅద్భుతమైన పాట. సాహిత్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!