22 July 2010

నిన్నా మొనా నీదే ధ్యానం

పల్లవి:

నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
నిమిషం నిమిషం సరసం నింపేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం

చరణం1:

విరిసివిరియని పరువాలు
లయతో తలపడు నాట్యాలు
కలహంసలా కదిలావులే
మరుహింసకు గురిచేయకే
కరుణ చూపించు నా దేవివై
తెలిసి తెలియని భావాలు
పలికి పలుకని రాగాలు
పులకింతలై పలికాయిలే
సురగంగలా పొంగాయిలే
మళయపవనాల గిలిగింతలో
పూచే పొదరిల్లు తోడుగా

నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం

చరణం2:

బ్రతుకే బహుమతి ఇది చాలా
మెరిసే అధరం మధుశాల
విరజాజిలా విరిసానులే
విరహాలలో తడిసానులే
ఎదుట నిలిచాను నీదానిగా
కలలా కలిసెను ప్రణయాలు
కధలై చిలికెను కవనాలు
రసరాణిలా వెలిగావులే
కవికన్యలా కదిలావులే
ప్రణయ రసరాజ్యమేలేములే
కాచే వెన్నెల్ల సాక్షిగా

నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
నిమిషం నిమిషం సరసం నింపేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం

No comments:

Post a Comment