నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా,
మాట్లాడు ఆడకపో మాట్లాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా,
నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట
నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
నువు తిట్టినా నీ నొటివెంట నా పేరోచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా నా చెంప మేద నీ గుర్తొకటుందని సంతొషిస్తా
మనసు పువ్వును అందించాను కొప్పు లొ నిలుపుకొంటవొ కాలి కింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను ఒట్టు పెట్టి రమ్మంటవొ గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసిన ఎవరాపినా చేసేది చేస్తుంటా
|నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా|
పూజించడం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించడం ప్రెమికుడి వంతు కరునిచడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా
ఏనటికో ఒక నాటికి నీ ప్రేమని సాధిస్తా
నిను చూడలని ఉన్నా
నిను చూడలని ఉన్నా నే చూడలెకున్న
మాట్లడలని ఉన్నా మాట్లడలెకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోన నాలోన కన్నీరవుతున్నా
No comments:
Post a Comment