20 July 2010

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల

పల్లవి:

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా
మెరుపుల చెల్లి మా పిల్లకి
మేఘాలన్ని పూపల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడవేళ
కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

చరణం1:

తకజుం తకజుం జుం
తకజుం తకజుం జుం
వేచి వేచి వేడెక్కే ఆ వేచి వున్న పండక్కే
నే పరుగులు తీస్తున్నా
కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే
నేనెదురై నిలుచున్నా
కాదే అవునై కవ్విస్తే
తకజుం తకజుం జుం
కన్నె పిలుపై కబురొస్తే
తకజుం తకజుం జుం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొమ్మచాటు కోకిలమ్మ గట్టిమేళాలెన్నో పెట్టి
కాళ్ళు కడిగి కన్నెనిచ్చి పేరంటాలే ఆడేవేళ

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

చరణం2:

తకజుం తకజుం జుం
తకజుం తకజుం జుం
జాబిలమ్మ కన్నుల్లో ఆ సందె సూరీడున్నట్టే
నీ తహతహ చూస్తున్నా
ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్నా
కాయే పండై కలిసొస్తే
తకజుం తకజుం జుం
అది పండే నోమై పిలకొస్తే
తకజుం తకజుం జుం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తోటలోని పూలన్నొచ్చి తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్ళి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

No comments:

Post a Comment