30 July 2010

రామయ తండ్రి ఓ రామయ తండ్రి

రామయ తండ్రి ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి ||2||

చరణం 1

తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒకదెబ్బకె ఇరిసావంట ||2||
పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్లు మరచి పోతుంట

చరణం 2

ఆగు బాబు ఆగు
అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ ||2||
నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నాకు తెలుసులే
నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదోతంట ||2||
దయజూపి ఒక్కసారి కాళ్లు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట

చరణం 3

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే ||2||
నువు దాటలేక కాదులే రామయతండ్రి ||2||
నన్ను దయ చూడగ వచ్చావు రామయతండ్రి
హైలెస్సా హైలో హైలెస్సా.....

No comments:

Post a Comment