22 July 2010

రాగమయి రావే అనురాగమయి రావే

పల్లవి:

రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే
నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకల లాడగా
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే
చరణం1:

చిగురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే
చిగురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే
రాగమయి రావే అనురాగమయి రావే
రాగమయి రావే

చరణం2:

సంధ్యలలో, సంధ్యలలో హాయిగా సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అమరాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అమరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు
రావే రాగమయి నా అనురాగమయి
రావే రాగమయి నా అనురాగమయి

చరణం3:

నీడచూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరు కలలుకనే అందాలన్ని నీవే
నిన్నందుకొని మైమరిచే ఆనందమంతా నేనే
రావే రాగమయి నా అనురాగమయి
రావే రాగమయి నా అనురాగమయి

No comments:

Post a Comment