పల్లవి:
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు

అన్నా అన్నా విన్నావా
చరణం1:
కాళిమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు
కాళిమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు
చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు
చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా విన్నావా
చరణం2:
గోకులమందున గోవిందునితో గోపికనై విహరిస్తాను

ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళి వింటాను
ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళి వింటాను
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా విన్నావా
చరణం3:
బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యము చేస్తాను

యమునా తీర విహారంలో హాయిగ పరవశమౌతాను
యమునా తీర విహారంలో హాయిగ పరవశమౌతాను
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా విన్నావా
No comments:
Post a Comment