01 July 2010

ధీర ధీర ధీర మనసాగలేదురా

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసు అందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రావమే దొర
నియమాలు వీడి రాణి వాసం ఏలుకోర ఏకవీర ధీర

సమరములొ దుకగా చాకచక్యము నీదేరా సరసములొ ఉట్టిగా చూపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగ అధిపతినై అది కాస్తా దొచైనా
పోరుకైన ప్రేమకైన అను దారి ఒకటేగా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసు అందుకో దొరా

శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగ కుసుమముతో ఖడ్ఘమే ఆడగా
మగసిరితో అందమే అంటు కడితే అంతేగ అణూణువు స్వర్గమే అయిపొదా
శాశనాలు ఆప జాలని తాపము ఉందిగా చెఱసాల ఖైదు కాని కాంఛ ఉందిగా
శత జన్మలైన ఆగిపొని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుతుందిరా
గుండెలొను నగార ఇక మోగుతుందిరా నవ సొయగాలు చూడ రాదు నిద్దురా
ప్రియ పూజలేవొ చేసుకొన చేతులార సేద తీరురా

No comments:

Post a Comment