పల్లవి:
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా ఆ ఆ
పరమానందము గనుమా
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా ఆ ఆ
పరమానందము గనుమా
చరణం1:
ఆదనూరూలో మాలవాడలో
ఆదనూరూలో మాలవాడలో పేదవాడుగా జనియించి
చిదంబరేశ్వరుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా ఆ ఆ
పరమానందము గనుమా
చరణం2:
తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి
తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి
పొలాల సేద్యము ముగించి రమ్మని
పొలాల సేద్యము ముగించి రమ్మని
గడువే విధించె యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో ఏరీతి పొలము పండిచుటో ఎరుగక అలమటించు
తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చె ఏ ఏ
పరుగున చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనె పూజారి
ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్చిల్లె
అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించె
No comments:
Post a Comment