పల్లవి
దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా . . .
యమ్మా యమ్మా ||2||
చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమేకదమ్మా ||దిగులు||
చరణం 1
గాంధీ స్టాచ్యూ ప్రక్కనేచూసిన ప్రేమవేరురా
జగదాంబ ధియేటర్లో నేచూసిన ప్రేమవేరురా
ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
వి ఐ పి కి ప్రేమవస్తే హొటల్ రూమ్ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే . . . ఓహొ . . .
నేనాటో ఎక్కి తిరుగుతుంటే తాలోపడ్డడంటరా
మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా
కళ్ళలోనే చూసిన ప్రేమ కధలు వేరురా
ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా ||సహొదరా 3|| ||దిగులు||
చరణం 2
లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా
చీరలిచ్చికొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా
ఆఫీస్లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా మరోప్రేమ
బస్ష్టాండ్లో ఆరింటికి మొదలురా
నూరు రూపాయి నోటుచూస్తే . . . ||ఓహొ||
నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టేకాలంరా
ఊరుమొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా కళ్ళతో ||దిగులు||
No comments:
Post a Comment