22 July 2010

సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా

పల్లవి:

సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా
సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా
సుడిగాలిలొన దీపం

చరణం1:

లోకాన పన్నీరు జల్లేవులే
నీకేమో కన్నీరు మిగిలిందిలే
పెదవారి గాయాలు మానుపేవులే
నీలోన పెనుగాయమాయేనులే
నీలోన పెనుగాయమాయేనులే
అణగారిపోవు ఆశ నీవల్లనె పలికె
సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా
సుడిగాలిలొన దీపం

చరణం2:

ఒక కన్ను నవ్వేటివేలలో
ఒక కన్ను చెమరించు సాగునా
ఒక చోట రాగాలు వికశించునా
ఒక చోట హృదయాలు ద్రవియించునా
ఒక చోట హృదయాలు ద్రవియించునా
ఎనలేని ప్రాణదానం ఎదబాస తీర్చునా
సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా
సుడిగాలిలొన దీపం

చరణం3:

కల్లోల పవనాలు చెలరేగునా
గరళాల జడివాన కురిపించునా
అనుకోని చీకట్లు తెలవారునా
ఆనంద కిరణాలు ఉదయించునా
ఆనంద కిరణాలు ఉదయించునా
విధికేమొ లీల ఐనా మది బరువు మోయునా
సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా
సుడిగాలిలొన దీపం

No comments:

Post a Comment