01 July 2010

గుత్తొంకాయా గుత్తొంకాయా

గుత్తొంకాయా గుత్తొంకాయా
గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ
గుమ్మడికాయా గుమ్మడికాయా
కొంటెదాని ఒంటిపేరు గుమ్మడికాయ
కోపమే ఎంతున్నా కత్తికే లొంగాలి
పనులే ఎన్నున్నా నూనెలో వేగాలి
గీరగా చూస్తున్నా కూరలా మారాలి
నీటుగా ఆపైన నోటికే అందాలి
బుద్ధిగా మాటేవింటు వంటింట్లోనే నువ్వుండాలి ||గుత్తొంకాయా||

కమ్మంగా వండివార్చు కలియుగభీమా
కల్యాణం అంటె నీకు తెలియదులేమ్మా
వధువే వయ్యారాల తాజా టమోటా వరుడే ఘాటుమసాలా
మంత్రం వంటింత్లో తాళింపు చిటపట హోమం గాస్‌స్టౌ జ్వాల
మండపము ఏదంటా పండితుడు ఎవరంటా
బంధువులు చుట్టాల సంగతులు ఏంటంటా
బాండి మండపము గరిటే పండితుడు
అల్లం వెల్లుల్లి అందరు బంధువులు
పచ్చని పసుపురంగే వధువు మెళ్ళో మాంగల్యమేగా ||గుత్తొంకాయా||

అప్పడము దప్పళము అన్నిటికన్నా
కాపురమే చేయడము తెలుసా కన్నా
మనసే పుచ్చుల్లేని కాయే అవ్వాలి మమతే పొంగుతుండాలి
జతగా ఉప్పు కారం రెండు కలవాలి బ్రతుకున రుచి పెరగాలి
కలతలు కష్టాల చేదును తగ్గించి
కులుకుల సుఖాల తీపిని గ్రహించి
గొడవలు పంతాల వగరును త్యజించి
మధురసబంధాల ఎంగిలి భుజించి
ఇద్దరు విందులు చేస్తు వందేళ్ళుంటే సంసారమేగా ||గుత్తొంకాయా||

No comments:

Post a Comment