21 July 2010

చీకటి కాటుక కాగల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో--Gouthami

పల్లవి:

చీకటి కాటుక కాగల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో
చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు వేసిన నీచూపు కిరణాలలో

వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం

చరణం1:

నలుపైన మేఘాలలోని ఇల నిలిపేటి జలధారలేదా
నలుపైన మేఘాలలోని ఇల నిలిపేటి జలధారలేదా
వసివాడు అందాలకన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్న

తీయని ఊహలతీరము చేరువ చేసిన స్నేహము ఏనాటి సౌభాగ్యమో

వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంత నీ పూజకోసం

చరణం2:

నూరేళ్ళ బ్రతుకీయమంటు ఆ దైవాన్ని నే కోరుకుంటా

ప్రతిరోజు విరిమాలచేసి నీ పాదాల అర్పించుకుంటా

మాయని మమతల తావున నిండిన జీవనవాహిని ప్రతిరోజు మధుమాసమే

వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంత నీ పూజకోసం

No comments:

Post a Comment