21 July 2010

చెలికాడు నిన్నే రమ్మని పిలువా--Kula Gotrallu

పల్లవి:

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

చరణం1:

నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి
నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా అహా ఒహోహో
అహహా ఒహో అ ఆ అ
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

చరణం2:

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా అహా ఒహోహో
అహహా ఒహో అ ఆ అ
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

చరణం3:

నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలి
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి
అహహా అహా ఒహోహో
హహా ఒహో అ ఆ ఆ
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా

No comments:

Post a Comment