పల్లవి:
తూరుపు దీపం సింధూరం
ఏ జన్మకు వాడని మందారం
అనురాగానికి సంకేతం
అమరప్రేమకే అంకితం
అమరప్రేమకే అంకితం
తూరుపు దీపం సింధూరం
ఏ జన్మకు వాడని మందారం
చరణం1:
పడమట వీచే సౌగంధం
ప్రకృతి పూసిన సుమగంధం
నింగిని మెరిసే సంధ్యాదీపం
నింగిని మెరిసే సంధ్యాదీపం
మధురరాత్రికి తొలిదీపం
అనురాగానికి ప్రతిబింబం
అనురాగానికి ప్రతిబింబం
ప్రణయానికి అది ప్రతిరూపం
తూరుపు దీపం సింధూరం
ఏ జన్మకు వాడని మందారం
చరణం2:
పున్నమి పూచే తొలిపుష్పం
పుడమికి వెలుగౌ శశిబింబం
జాబిలి మెడలో చుక్కలహారం
జాబిలి మెడలో చుక్కలహారం
మొదటి రాత్రికి ఆహ్వానం
ఆనందానికి తొలి ఆస్వాదం
ఆనందానికి తొలి ఆస్వాదం
ప్రణయానికి అది ప్రతిరూపం
తూరుపు దీపం సింధూరం
ఏ జన్మకు వాడని మందారం
అనురాగానికి సంకేతం
అమరప్రేమకే అంకితం
అమరప్రేమకే అంకితం
తూరుపు దీపం సింధూరం
ఏ జన్మకు వాడని మందారం
No comments:
Post a Comment