02 August 2010

చిన్నరి నా రాణి చిరునవ్వులే నవ్వితే

చిన్నరి నా రాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే
అందాల నా రాజు అనురాగమె చిందితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే

నా నోము పండింది నేడు నాకు ఈనాడు దొరికింది తోడు
నా రాణి అధరాల పిలుపు నాకు తెలిపేను తనలోన వలపు నిండు వలపు
అందాల నా రాజు అనురాగమె చిందితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే

ఎన్నెన్ని జన్మాల వరము నేడు నా వాడవైనావు నీవు
నా వెంట నీవున్న వేళ కోటి స్వర్గాల వైభోగ మేల భోగ మేల
చిన్నరి నా రాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులికించి మైకంలో ఊయలలే ఊగిలే

ఈతోట మన పెళ్ళి పీట
పలికే మంత్రాల గోరింక నోట
నెమలి పురి విప్పి ఆడింది ఆట
వినగ విందాయే చిలకమ్మ పాట పెళ్ళి పాట

అందాల నా రాజు అనురాగమె చిందితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే

No comments:

Post a Comment