అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
ఓ..అసలేవిరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు
ఆ..చారెడు..పిడికెడు. బారెడు పిల్లా ఎల్లగున్నావు
ఎందా ?
చెంపకు కన్నులు చారెడు..
సన్నని నడుము పిడికెడు..
దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు..మనసిలాయో !
అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
ఆ..అయ్యోపావం ఆషాండ్ర కార్యం ఎందాయి
అదేమిటి ?
గుటకలు..చిటికెలు..కిటుకులు అబ్బో చాలా గడుసు
గుటకలు..చిటికెలు..కిటుకులు? ఏమిటి సంగతి ?
కులుకు చూస్తే గుటకలు..
సరసకు రమ్మని చిటికెలు..
చక్కని చిన్నది అందం చందం చేజిక్కాలని కిటుకులు
మనసిలాయో !
అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
మనసిలాయో మనసిలాయో అమ్ముకుట్టి!
గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు
పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు
చుట్టూ చూస్తే అందాలు…లొట్టలు వేస్తూ మా వారు
చుట్టూ చూస్తే అందాలు…లొట్టలు వేస్తూ మా వారు
అక్కడ తమకు ఇక్కడ మనకు విరహం లోన వెక్కిళ్ళు..మనసిలాయో !
అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
No comments:
Post a Comment