29 September 2010

మీఠీ మీఠీ ధున్ ఒ బజాయే

మీఠీ మీఠీ ధున్ ఒ బజాయే
రాధా కె మన్ కొ లుభాయే
గోపీ బోలే గిరిధర్ నందలాలా
నందలాలా ||మీఠీ..||
గోపీ బోలే గిరిధర్ నందలాలా

పిలిచే పెదవుల పైనా.. నిలిచే మెరుపు నువ్వేనా..
పిలిచే పెదవుల పైనా.. నిలిచే మెరుపు నువ్వేనా..
నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా
తనలో ఆనంద లహరి సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతి దారీ నదిగా మారి మురిసినదా ముకుందా
కాలం మేను మరచి ఙ్ఞాపకాల్లో జారిపోయిందా
లోకం గోకులం లా మారిపోయీ మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా.. నీ చెంతా చేరిందా.. గోవిందా..

||పిలిచే||

ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నావెంటే వస్తోంది ఎటు వెళ్ళినా
మనసును ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
ఊరంతా ఊగిందా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా..

ఝూమో రె ఝూమో రె ఝూమో రె ఒ గిరిధార్ ||5||
యారో మురళి బజావె గిరిధర్ గోపాలా
భజాకే మన్ కో చురాలే గిరిధర్ నందలాల

నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా
చిన్ని కృష్ణయ్య పాదాల సిరి మువ్వలా
నను నీ మాయ నడిపింది నలువైపులా
అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేళా
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం ఊయలూపి ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా..

||పిలిచే||

1 comment:

  1. మీ కలెక్షన్ చాలా బాగుందండీ.. బాగా వ్రాస్తున్నారు.. ఇలాగే కొనసాగించండీ..

    ReplyDelete