05 September 2010

గోరింటా పూచింది కొమ్మాలేకుండా

గోరింటా పూచింది కొమ్మాలేకుండా...మురిపాళ అరచేత మొగ్గ తొడిగింది.. (2)

ఎంచక్కా పండేన ఎర్రని చుక్క..(2)
చిట్టి పేరంటానికి శ్రీరామా రక్షా..
కన్నే పేరంటాలికి కలకాలం రక్షా..

గోరింటా పూచింది కొమ్మాలేకుండా...మురిపాళ అరచేత మొగ్గ తొడిగింది..

మామిడి చిరుగు ఎరుపు... మంకిన పువ్వు ఎరుపు.. మణులన్నిటిలోన మాణిక్యం ఎరుపు.. (2)

సందే వన్నేల్లోన సాగే మబ్బు ఎరుపు ...(2)
తాను ఎరుపు అమ్మాయి తన వారిలోన ..

గోరింటా పూచింది కొమ్మాలేకుండా...మురిపాళ అరచేత మొగ్గ తొడిగింది..

మందారంలా పూస్తే.. మంచి మొగుడొస్తాడు.. గన్నేరులా పూస్తే.. కలవాడోస్తాడు... (2)
సిందూరంలా పూస్తే .. చిట్టి చేయంతా...(2)
అందాల చందమామ.. అతనే దిగివస్తాడు..

గోరింటా పూచింది కొమ్మాలేకుండా...మురిపాళ అరచేత మొగ్గ తొడిగింది..

పడకూడదమ్మా పాపాయి మీద.. పాపిష్టి కళ్ళు .. కోపిష్టి కళ్ళు...
పాపిష్టి కళ్ళలో పచ్చా కామెర్లు..
కోపిష్టి కళ్ళలో కొరివి మంటల్లు..

గోరింటా పూచింది కొమ్మాలేకుండా...మురిపాళ అరచేత మొగ్గ తొడిగింది.. (2)

No comments:

Post a Comment