04 October 2010

ఇది నాదని అది నీదని

ఇది నాదని అది నీదని
ఇది నాదని అది నీదని
చెప్పలేనిది ఒక్కట్టి ఈ ఒక్కట్టి
ఏమది ?
అది ఇది అని చెప్పలేనిది
ఆ చెప్పలేనిది ఏమది ?
అది మనసున పుట్టి మమతల పెరిగి
మనువై పూచేది
అది ఇది అని చెప్పలేనిది
అది ఇది అని చెప్పలేనిది

వెన్నెలమ్మ రాతిరిగా
వేకువమ్మ పొద్దుటిగా
కోకిలమ్మ ఆమనిగా
ఏ పూవ్వు పులకరింత
ఈ పడక పలకరింత
ఈ పూవ్వు పులకరింత
ఈ పడక పలకరింత
ఈ జన్మకు చాలనంత
పరవశమంతా మనదే మన ఇద్దరిదే
పదే పదే వినిపించే ప్రియ దేవుడి అష్టపదే
అది ఇది అని చెప్పలేనిది
అది ఇది అని చెప్పలేనిది

ముగ్గిట వలపుల ముంగిటా
వయసు ముగ్గు వేయనా
నిగ్గులు పొంగిన చెక్కిటా
సిగ్గుల యెరుపులు తాకనా
వయ్యారంగా పార్వతి శౄంగారంగా శ్రీయపతి
ఓంకారంగా కలిసి ఏకాక్షరమై మురిసే
పరవశమంతా మనదే మన ఒక్కరిదే
ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపదే
అది ఇది అని చెప్పలేనిది

No comments:

Post a Comment