||ప|| |ఆమె|
విన్నపాలు వినమనీ వచ్చెనయ్య అన్నమయ్య
పన్నగపు తెరతీయ వెన్నునితో చెప్పవయ్య
|అతడు|
ఏం.. అన్నమయ్య ఆయన పాటల్లో ఆడుకోలేడా
చెప్పటానికి నేనెవరిని
|ఆమె|
ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
|ఖోరస్| || ఆ పాటల్లో ||
|ఆమె| హరినే |ఖోరస్| ఆహా
|ఆమె| కొలిచా |ఖోరస్| ఆహా
|ఆమె|
నిను పిలిచే వేళల్లో
|ఆమె| సిరినే |ఖోరస్| ఆహా
|ఆమె| చూశా |ఖోరస్| ఆహా
|ఆమె|
నీ నవ్వుల వెలుగుల్లో నీవే
|ఖోరస్| సత్యం శివం సుందరం
|ఆమె| || ఆ పాటల్లో ||
.
||చ|| |ఆమె|
సూరిడువీ నీవే మము మేలుకొలుపు వేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|ఆమె|
సందమామ నీవే మా జోల పాడు వేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|ఖోరస్| || సూరిడువీ ||
|ఆమె|
అన్నా అనాలా మాకు నువ్వే అన్నీ అనాలా
|ఆమె|
పసిపాప పలుకులా పరమాత్మ ఉనికిలా
చలువ చెలిమి చిలికినావు నీవే
సత్యం శివం సుందరం
|ఖోరస్ & ఆమె |
మా పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
మా మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
.
||చ|| |ఆమె|
అమ్మతనము నీది మా ఆకలి తీర్చేవేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|అతడు|
నాన్న గుణము నీది మా అల్లరి ఆపేవేళా
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|అతడు|
అమ్మతనము నాదా మీ ఆకలి తీర్చేవేళా
నాన్న గుణము నాదా మీ అల్లరి ఆపేవేళా
|ఆమె|
ఏ చుట్టరికం లేదే.. చుట్టుపక్కలా
ఏ మంత్రం వేసి మమ్ము చుట్టేశావిలా
|అతడు|
అమ్మమ్మమ్మ చాలమ్మా అమ్మమ్మమ్మ ఆపమ్మా
అన్నెమెరుగను పున్నెమెరుగను అమ్మా చూడు ఈ బూ..గోల
అయ్యయ్యయ్యో అయ్యో..
|అతడు|
ఏదేదో అంటున్నారు..కాదని చెప్పవేలా
అలా ఇలా ఎలా అన్నా కర్తవు నువ్వేగా..నా వెనకాల
|ఆమె|
చాల్లే ఊరుకోరా.. మధ్యలో నేనెవరిని
|అతడు|
నా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
నా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మ
|అతడు| హరినే |ఖోరస్| ఆహా
|అతడు| కొలిచా |ఖోరస్| ఆహా
|అతడు| నిను పిలిచే వేళల్లో
|అతడు| సిరినే |ఖోరస్| ఆహా
|అతడు| చూశా |ఖోరస్| ఆహా
|అతడు| నీ నవ్వుల వెలుగుల్లో నీవే
|అందరు|
సత్యం శివం సుందరం
మా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
మా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మా
No comments:
Post a Comment