30 October 2010

కమ్మగ సాగే స్వరమో

||ప|| |అతడు1|
కమ్మగ సాగే స్వరమో || 2 ||
అల్లుడూ…
||ప|| |అతడు|
కమ్మగ సాగే స్వరమో || 2 ||
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ మది అడిగినది
పద వెతకమని అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
|అతడు1| అద్గదీ
|ఆమె| || కమ్మగ సాగే ||
|అతడు1| అద్గదీ
|ఇద్దరు|
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
||చ|| |అతడు|
తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో
|ఆమె|
దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో
|అతడు1|
కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో
|ఆమె| ఏమో….ఓ ఓ ఓ…
|అతడు| ||కమ్మగ సాగే ||
|అతడు1| ..శభాష్!
|ఇద్దరు|
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
||చ|| |ఆమె|
తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో
|అతడు|
కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో
|ఆమె|
పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో
|అతడు| ఏమో.. ఓ ఓ ఓ…
|ఆమె| కమ్మగ సాగే స్వరమో |అతడు| రమ్మని లాగే చెలిమో
|ఆమె| అది ఎవరిదనీ |అతడు| మది అడిగినది
|ఆమె| పద వెతకమని |అతడు| అటు తరిమినది
|ఇద్దరు| కథ ముదురు మదన మహిమో..
|అతడు1| బ్రహ్మాండం!
|ఇద్దరు|
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.

No comments:

Post a Comment