30 October 2010

అంతా రండోయ్ రండి తందనాలకి

అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్లకి
|| అంతా ||

గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళా
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
తకిట తక తకిట తకిట తక తాళమే వేయగా.. శివ తాండవం చేయగా

తాళమే వేయగా.. శివ తాండవం చేయగా
|| అంతా ||


కవ్వించిన కాలం కలిసొచ్చిన వైనం
కోలాటం వేస్తూ చేశే కోలాహలాన

కేరింతల మేళం.. ఎలుగెత్తిన గానం
ఊరంతా హోరెత్తించే ఈ రోజునా

కోదండ రామయ్య కళ్యాణమో

గోపాల కృష్ణయ్య జన్మాష్టమో
అన్ని పండుగలలో |ఖోరస్| కళలు కలిపి
వెయ్యి వేణువులలో |ఖోరస్| స్వరములొలికి

సుందర స్వప్నము కన్నుల ముందర నిలిచి పిలిచెనిదిగో
|| అంతా ||


ఎన్నో తిరనాళ్లు తిరిగొచ్చినవాళ్లు
ఏనాడు చూసి ఉండరు ఈ సంబరాలు

వెన్నెల కెరటాలు ఎగసే సంద్రాలు
ఆ నింగీ నేలా కలిపే ఈ నవ్వులూ..

శ్రీవాణి కొలువైన ఈ కోవెల

సింగారమయ్యింది ఇదిగో ఇలా
మదిని మేలుకొలిపే |ఖోరస్| తెలుగు కొరకు
మనిషి మేలు తెలిపే |ఖోరస్| తెలివి కొరకు

చదువుల తల్లికి సేవలు చెయ్యగ తగిన తరుణమిదిగో
||అంతా||

No comments:

Post a Comment