22 November 2010

అయ్యా ఆ ఆ ఆ ఆ రామయ్య

అయ్యా ఆ ఆ ఆ ఆ రామయ్య
కొలిచినందుకు నిన్ను కోదండరామ
కొలిచినందుకు నిన్ను కోదండరామ
కోటి దివ్వెల పాటి కొడుకువయినావా
తలచినందుకు నిన్ను దశరథ రామ
వెండి కొండల సాటి తండ్రివయినావా
జయరామ జగదభిరామ
పరందామ పావన నామ
జయరామ జగదభిరామ
పరందామ పావన నామ

బుడిబుడి నడకల బుడతడివై ఒడిలో ఒదిగిన ఓరయ్యా
బుడిబుడి నడకల బుడతడివై ఒడిలో ఒదిగిన ఓరయ్యా
కలల పంటగా బ్రతుకు పండగా
కలల పంటగా బ్రతుకు పండగా
కళ్యాణరాముడిలా కదలి వచ్చావా
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ

నడిచే నడవడి ఒరవడిగా నలుగురు పొగడగ ఓరయ్య
నడిచే నడవడి ఒరవడిగా నలుగురు పొగడగ ఓరయ్య
నీతికి పేరుగ ఖ్యాతికి మారుగ
నీతికి పేరుగ ఖ్యాతికి మారుగ
సాకేతరాముడిలా సాగిపోవయ్య
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ

ఎంతడివాడోయ్ రామచంద్రుడు
ఎంతడివాడోయ్ రామచంద్రుడు
ఆ తాటకిని చెండాడినాడోయ్
యాగమును కాపాడినాడెంతడివాడోయ్ రామచంద్రుడు
ఎంతడివాడోయ్ రామచంద్రుడు
మిధిలకు వచ్చి రామయ్య రాముడు
శివుని విల్లు విరిచి రామయ్య రాముడు
అహ సీతను చేపట్టి రామయ్య రాముడు
హొయ్ హొయ్ సీతను చేపట్టి రామయ్య రాముడు
సీతారాముడు అయ్యేదెప్పుడో
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ

No comments:

Post a Comment