15 November 2010

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా
కాసేపు ఆ జ్ఞాపకాలన్నీ ఎదురైతే
నీ రూపు ఆ చోట పసిపాపై తోస్తుంది
కథలా కదిలే కాలం లోన అన్నీ వింతలే
చెలిమే చిలికే కళ్ళలోన కలవా చింతలే
అదిగో తేనెటీగల్లె తాకింది ఆ చల్ల గాలి
అపుడే తేనే తీపంతా నన్నందుకోమంది వెళ్ళి

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా

చెరువుల్లో ఈత ఇసకల్లో రాత
తిరనాల్లో ఆడే సైఆట
గుడిలోని పాట తూనీగల వేట
బడిలో నేర్పించే బతుకాట
చిననాటి స్నేహాల చిగురింతలే
ఎదిగెను ఈనాటి పులకింతలై
ఆ బొమ్మ పెళ్ళిల్ల సందల్లలో
ఈ బొమ్మకెన్నెన్ని తుల్లింతలో
నువ్వు దాచాలి అనుకున్నా వీల్లేదని తెలుసా

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా

మనపై జడివాన కురిసే నిమిషాన
పడవలు తయ్యారే గుర్తుందా
మామిడి కొమ్మల్లో కోకిలతో చేరి
కూసే కచ్చేరీ గుర్తుందా
నిన్నమొన్నే అయినట్టు వున్నాయిలే
ఆ నవ్వు నాతో ఉండేట్టు చేసాయిలే
పాదాలు ఏ దారి నడిపించునో
ఏ ప్రేమ తీరాలు కనిపించునో
అడగలంటు నీ చెంత వాలిందలా మనసు

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా

No comments:

Post a Comment