17 November 2010

పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను

పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను
పులకరించి ఈ జగమూ నవ్వెను
కొలను నవ్వెను కోరిక నవ్వెను
నవ్వలేక నేనున్నాను ||పువ్వు||

వయసు నవ్వెను సొగసూ నవ్వెను
నవ్వురాక ఈమనసే నలిగెను ||2||
వలపు నవ్వెను తలపూ నవ్వెను
పగలకే అవి బలి అయిపోయెను ||పువ్వు||

కడుపుతీపితో కన్నబిడ్డకై
హితము కోరి ఏగిన తండ్రికి
చేయని నేరము శిక్ష వేసెను
మాయని పాపం శాపాలాయెను ||పువ్వు||

కలిమి చెలిమి వెలసిన ఇల్లు
వెలుగు మాసి వెలవెలబోయెను
లోకం నవ్వెను శోకం మిగిలెను
లోలోపల గుండెలవిసెను ||పువ్వు||

No comments:

Post a Comment