24 November 2010

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కధ
మధుర మధుర మహిమాన్విత భోధ సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కధ
మధుర మధుర మహిమాన్విత భోధ సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కధ
మధుర మధుర మహిమాన్విత భోధ సాయి ప్రేమ సుధ

షిరిడీ గ్రామంలో ఒక బాలుని రూపంలో
వేపచెట్టుక్రింద వేదాంతిగ కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టునీడయే గురు పీఠం
ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయీ,సాయి రా మశీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ
బాబా బోధల నిలయమదోయి

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కధ
మధుర మధుర మహిమాన్విత భోధ సాయి ప్రేమ సుధ

ఖురాను బైబిలు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసే
నీటి దీపములను వెలిగించే
పచ్చికుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
దిండీ వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్ధం తెలిపే
ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాధలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపుల ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

నీదని నాదని అనుకోవద్దని
ధునిలో ఊది విభూదిగనిచ్చే
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
కక్కడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా
పరిపూర్ణుడై గురుపౌర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మండ నాయక శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్‌

No comments:

Post a Comment