25 November 2010

ఓనమాలే సంగీతంలో నేనే నేర్చుకోలేదంటా

ఓనమాలే సంగీతంలో నేనే నేర్చుకోలేదంటా
గుండెల్లోని బావమేదో పొంగుతుంది పాటలాగా ||2||
చిన్ననాడు విన్న అమ్మ జోలపాట సంగీతంలా నేర్చి
గొంతులోని మార్చి సుస్వరంలా కూర్చి పాడుతున్న పాటే
నా స్వరం గురించి మీరు మెచ్చుకుంటే జిల్ జిల్ జిల్‌లే

మనస్సు తుల్లు తుల్లు తుల్లులే ||2|| ఓనమాలే
పలుకే చిలకలకే అరువే ఇచ్చేటంత తియ్యంగా ఉంటే
పలికే ప్రతి పదమే మనస్సు లోతుల్లోకి చేరుతుందంటే
గళమే కోయిలయితే కూత నేర్పటం కమ్మంగా ఉంటే
ఓహో పాడే ఆ తలపే విన్నవారి ఎదలో ఊయలూగుమలే

తాళం తప్పని తకదిమిత రాగం వింటే తల ఆడించని మనిషంటూ
ఉండదు అసలే తమకం చక్కగా అలలాగా కళలొలికిస్తే హృదయం
తియ్యని అనుభూతికి లోనవుతుందీ మమకారంతో గానం
మనమే ఆలపిస్తే మధుమాసాలే వచ్చి ముంగిట్లో విరబూస్తుంటే జిల్
జిల్ జిల్‌లే మనసే తుల్లు తుల్లు తుల్లులే ఓనమాలే
సరిగ అంటూ సరిగా సంగీతంతో నువ్వే పెదవే కలిపాకా

మపనీ అంటూ మారనీ తానే అక్కున చేర్చుకోదా ఎంచక్కా
జతకా ఆడుకోయిలా తనతో వేసి ఆడిస్తుంటే చాలు కదా
ఓహొ లయగా శృతిలయగా గుండెలోనా తాను గూడే కట్టునుగా
ఆనందాన్నీ మనకి ఇచ్చే మంత్రమేదో తనలో ఎంత దాచిందో
ఏమో ఆస్వాదించే మనస్సే ఉంటే అంతో ఇంతో ఆలాపనగా
చేస్తుంది స్నేహం ఎంతో సృష్టి అంతా తానే అల్లుకుంది పది అష్టపది
తానై చెంత చేరి వస్తే
జిల్ జిల్ జిల్‌లే మనస్సే తుల్లులే ఓనమాలే

No comments:

Post a Comment