గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలికఉంది
ఇది ఓహారే రామచిలుక ఎరిక మహామహులకెరుక
నువ్వు మరిలేతగనక నీకా తికమక తెలియవిక
గోదారి గట్టుపైన చిన్నారి చిలకఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
కటింగ్ జీన్స్‌లో మీ ముందుకొస్తే అల్లర్లుఏంటండి
పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
ముదుర్ స్టెప్స్‌లో ర్యాగింగ్ జరిపితే మీలీలేంటండీ
క్లాస్ అయ్‌పోయేటట్లుగా కటింగ్‌లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగళ్లని అన్నయ్యలనమంది
ఆప్లేసులో కౌంటు టు కన్నయ్యలనుకోండి
అయితే హరే రామచిలుక కాదది హరే భామచిలుక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీపిలక ||గోదారి||
సీటీబస్సులో కాపేసుకుంటే కామెంట్స్ ఏంటండీ
చిట్టి పెదవులే కష్టాలు పడితే మాగుండె చెరువౌద్దీ
ఏదో బుక్స్ తో కాలేజికెళితే మీలుక్స్ ఏంటండీ
చిన్ని స్టెపులే ఎగేసుకొంటే మాకన్ను ఎరుపౌద్దీ
ట్రాఫిక్‌లో కావాలిలే పార్కింగ్ ఏమిటండీ
కాపాడుతూ ఉంటామని హామీలు అనుకోండీ
అయితే హరేరామచిలుక కాదదరి హరేభామచిలుక
నాకది బలే తెలుసుకనక మెలికది తొలగను ఝూమనకా ||గోదారి||
No comments:
Post a Comment