17 November 2010

ఏమని అడగను ఏ వరము నిను కోరను

ఏమని అడగను ఏ వరము నిను కోరను
నీ దాసదాసానుదాసుడను, నీ ఎదుట నే మూగను కృష్ణా ఏమని అడగను
మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలులేవు
రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు
అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్థాంగలక్ష్మీ లేనే లేదు ఆ
అడగకున్నా అన్నీ యిచ్చే వాడే నా వాడని తెలిసే
ఏమని అడగను ఏ వరము నిను కోరను
కృష్ణా కృష్ణా కృష్ణా ఏమని అడగను ఆ

బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు
అందరిచేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు ఆ
అంతా నువ్వే అంటాడయ్యా ఆ ఒక్కటేదో అడగవా
అమ్మా నీ కృష్ణయ్యా చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి
నోరు చూపమంటే తన నోట పదునాలుగు భువనాలను
చూపించాడు కదమ్మా అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో
నోరు తెరిచి చూసిందే కానీ, నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లీ ఆ
మన్ను తిన్న ఆనోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏవరమడిగిందమ్మా
వేణుగానమును విని ఆగోవులు తరించినవిగాని గోవిందుని ఏం కోరాయమ్మా
ముక్తికాంతుడగు ముకుందుడే ||2||
నా యందు నిలిచి ఉన్నాడు, నా పంచప్రాణాలు
తులసిదళాలతో అర్చన చేస్తున్నాను
ఇంతకన్నా కావలసింది ఇంకేంఉందీ

No comments:

Post a Comment