22 November 2010

ఆడే పాడే పసివాడ అమ్మలేని నినుచూడ

ఆడే పాడే పసివాడ అమ్మలేని నినుచూడ
కన్నీటి కధ ఆయే దీపావళి
ఆడే పాడే పసివాడ అమ్మలేని నినుచూడ
కన్నీటి కధ ఆయే దీపావళి
ఊరెళ్ళ వెలుగు ఆనందం మనకు కనరాని దూరమురా కనరాని దూరమురా

నెనరెల్ల అనలాన నీరైననాడు నెమ్మది మనకింక కనరాదు
నెనరెల్ల అనలాన నీరైననాడు నెమ్మది మనకింక కనరాదు
ఇలవేల్పువలే ఇంట వెలసిన దేవి
ఇలవేల్పువలే ఇంట వెలసిన దేవి
మమతే మరచి మరుగైనదేమి
కన్నులలోని కాంక్షలు అన్ని కలలాయెనే నేటికిరా కలలాయెనే నేటికిరా

అనురాగమనతానే అనిపించు దేవి ఎనలేని భావాల పెనవేసి
అనురాగమనతానే అనిపించు దేవి ఎనలేని భావాల పెనవేసి
పాసము తెగతెంచి మోసముచేసే
పాసము తెగతెంచి మోసముచేసే
బ్రతుకే మనకు బరువైపోయే
నిన్నటి కథలే నేటికి వ్యధలై నిను నన్ను వేధించెరా ఆ ఆ నిను నన్ను వేధించెరా

No comments:

Post a Comment