ఇదే నీ విలాసమా నాతో పరిహాసమా ప్రభో
కననేరవా ఎనలేని నా చెర
నడికానలోని నా మొర వినగోరవా
ఎలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా
ఎలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా
దారిని పోయే ఈ జడదారి తీరులు చూపి
దారిని పోయే ఈ జడదారి తీరులు చూపి
ఊరిమి మాపి వైరము రేపి
ఊరిమి మాపి వైరము రేపి ఆరడి చేసేవా
ఎలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా
లోకములోన చౌకగ చేసి నవ్వులపాలు చేయుదవా
లోకములోన చౌకగ చేసి నవ్వులపాలు చేయుదవా
రోషము మాని వేషము మాని శాంతినై మసలే
చేసిన సేవ మోసిన ఆశ
చేసిన సేవ మోసిన ఆశ నాశము చేసేవా
ఎలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా
వన్నెసన్నలెరుగడాయెనే
వలపు తెలిసి పలుకడాయెనే
వాని మనసు మలుపగోరవా
నాదు మాట నిలుపజాలవా
రంగా రంగా రంగా రంగా
No comments:
Post a Comment