11 November 2010

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏం చేశావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
ఎన్ కాదల్ ఉణక్కు పురియదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా
ప్రేమించమంటు నను చంపేస్తావే
వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పైపైకొస్తే
అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే
నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే
కళ్లలో లోగిళ్ళలో నీ రూపమే నిండే ||నువ్వంటేనే||

మనసులో జరిగెలే తీయని రాపిడీ
తనువులో మొదలయే వెచ్చని ఒరిపిడీ
నవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే
వయ్యారాలు ఒలికిస్తవే
నే వస్తుంటె మమకారమై
వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై
చెల్లమే ఎన్ చెల్లమే నినైవిల్ నీకలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే నిగల్వల్ నీ కరందాయె ||నువ్వంటేనే||

పగలిలా స్వప్నమే ఏమిటీ అల్లరీ
రేయిలో ఆలాపనై చేస్తవే అలజడీ
వదిలేయంటే పెనవేస్తవే
పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే
నే వచ్చాను హిమబిందువైc
ముంచేసెయ్‌రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై
శ్వాసమే ఎన్ నేసమే ఒరు వాయా ఎనక్కాగా ||నువ్వంటేనే||

No comments:

Post a Comment