మా జనని లోక పావని మా అవని ప్రేమ ధమని
పుట్టినందుకు పువ్వుగ మారి కొలవరా అమ్మని
పువ్వురాలినా తావి తీరని జన్మకే జన్మని అమ్మని
మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని
బ్రహ్మను కన్న భగవతి
మమతలు పంచే మధుమతి
కోవెల ఎరుగని హారతి
ఏ వెల కందని శ్రీమతి
కర్ణ రాధని భీష్మ గంగని
కీర్తని ఆ కృష్ణ యశోదని
వేదనతీర్చే వేద వాక్కుగా పిలవరా అమ్మని
పేగుచించి నీ పేరుపెట్టిన ఆమెదే ప్రేమని అమ్మని
మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని
సహనంలో ఒక సాగరం
జీవనదులకే పుష్కరం
అమ్మ అన్న మధురాక్షరం
అనురాగంలో సుస్వరం
తల్లి గౌరిని కన్నె మేరిని
కన్యకా పరమేశ్వరి ధరణిని
ఆకలేసిన కేకలేసిన అలగని అమ్మని
ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అమ్మని
మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని
పుట్టినందుకు పువ్వుగ మారి కొలవరా అమ్మని
పువ్వురాలినా తావి తీరని జన్మకే జన్మని అమ్మని
No comments:
Post a Comment