03 June 2010

ఏడవకేడవకేడవకమ్మా

ఏడవకేడవకేడవకమ్మా
అమ్మకు ప్రాణం నీవేనమ్మా
లాలీ జోలా నీకు నేనేనమ్మా
ఇవి అమ్మపాలు ఇవి గుమ్మపాలు
ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు ఆ..

కనులు చీకటి చేసాడుకనుకే
కనుపాపగా నిన్ను ఆ దేవుడిచ్చాడురా..
కనులతో నిన్ను కనలేనుగానీ
కనురెప్పనై నిన్ను కాపడుకుంటానురా..
పడగతో ఆడే పసి మనసు
కొరివినే కొరికే చిరు వయసు
పాపమేదో పుణ్యమేదో ఎరుగని మా పాపకీ
ఇది అమ్మ లాలీ ఇది నాన్న లాలీ
ఇది నిద్దరమ్మ కోరే చల్లనైన లాలీ ఆ..

ఏడవకేడవకేడవకమ్మా
అమ్మకు ప్రాణం నీవేనమ్మా
లాలీ జోలా నీకు నేనేనమ్మా
ఇవి అమ్మపాలు ఇవి గుమ్మపాలు
ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు ఆ..

No comments:

Post a Comment