07 June 2010

మా ముద్దు రాధమ్మ రాగాలే..శ్రీమువ్వ గోపాల గీతాలు

ఆ చెయ్యి ఈ చెయ్యి తాళాలు..అనురాగాలలో గట్టిమేళాలు

మా ముద్దు రాధమ్మ రాగాలే..

నువ్వందం .. నీ నవ్వందం .. తల్లో మల్లెపూవందం
కట్టందం .. నీ బొట్టందం .. నువు తిట్టే తిట్టే మకరందం
సూరీడు చుట్టూ భూగోళం .. రాధమ్మ చుట్టూ గోపాళం

నడుము ఆడితే కథాకళి..జడే ఆడితే కూచిపూడి
తలే ఆడితే ఫలానా..తతిమాది థిల్లానా

మా ముద్దు రాధమ్మ రాగాలే..శ్రీమువ్వ గోపాల గీతాలు
ఆ చెయ్యి ఈ చెయ్యి తాళాలు..అనురాగాలలో గట్టిమేళాలు

కూరలు తరిగే కూరిమి ఇష్ఠం .. చేతులు తెగితే మూతులకిష్ఠం
ముద్దలు కలిపీ పెడితే ఇష్ఠం .. ముద్దులదాకా వెడితే ..
వలచిన వారి పరాకు అందం .. గెలిచిన సతిపై చిరాకు అందం
కోపతాపముల కోలాటం లో మనసు ఒక్కటే మాంగల్యం
కస్సుబుస్సుల కామాటం లో కౌగిలి గింతే కళ్యాణం

No comments:

Post a Comment