07 June 2010

గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే !

గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే !

గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే
దూరాన ఉంచొద్దే నా సఖియా..భారాలు పెంచొద్దే
నీకోసమే ప్రియా జన్మించా..నీ కంటి పాపల ఊయలలో
నీ ప్రేమకై ఇలా జీవించా..నీ జంట కోరిన ఊపిరితో

నువ్వంటే నాకు ప్రాణం అన్న మాట నీతో చెప్పే దాక
నా గొంతు మూగబోదులే !

హే గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే !

నీ జతలో కలిసే మనసే..
పురివిప్పిందమ్మ చెప్పిందమ్మ ప్రేమ కధా
ఆ కధలో కదిలే ఎదలో..
నులి వెచ్చని గాలే తెచ్చిందమ్మ తేనె సుధా

నీ మాటా మంతీ వింటే చాలు నా మనసూ
నా కంటీ ముందూ నిన్నూ చేరే ఆ గడుసూ

వెన్నెల్ల వేళా వేచీ వేగుతున్న వేడి ఈడు..
వేధించ వద్దు అందిలే !

గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే
దూరాన ఉంచొద్దే నా సఖియా..భారాలు పెంచొద్దే

వేసవిలో పొడి వెన్నెలలో..
ఒడి చేరిందమ్మ తీరిందమ్మ తీపి సదా
చీకటిలో చలి వాకిటిలో..
చెలరేగిందమ్మ సాగిందమ్మ మౌన వ్యధా

నీ గజ్జె ఘల్లు మంటే నాలో నెమలిమలూ
నా గుండె ఝల్లుమన్న వేళా సరిగమలూ

ఏ దారీ కాన రాని కారుమబ్బు కమ్ముకొచ్చి
నీ కన్ను గీటుతోందిలే !

గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే !

గుండెల్ని పిండొద్దే నా చెలియా.. మంటలు రేపొద్దే
దూరాన ఉంచొద్దే నా సఖియా..భారాలు పెంచొద్దే
నీకోసమే ప్రియా జన్మించా..నీ కంటి పాపల ఊయలలో
నీ ప్రేమకై ఇలా జీవించా..నీ జంట కోరిన ఊపిరితో

నువ్వంటే నాకు ప్రాణం అన్న మాట దాక
నా గొంతు మూగబోదులే !

No comments:

Post a Comment