ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ..ప్రాణం....ప్రాణం..ప్రాణం
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ......ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ ఆ ....బతికే కలలే నిజములే
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి పట్టు తేనె కోరిందెవరో
మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే చెరగని గురుతైపోదా
ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా
ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ......ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ ఆ ....బతికే కలలే నిజములే
మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలో ఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై అల్లుకుంటే ప్రేమే కదా
ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా
మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ......ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ ఆ ....బతికే కలలే నిజములే
No comments:
Post a Comment