03 June 2010

కోటి తారలా కాంతి ధారలా

కోటి తారలా కాంతి ధారలా
నేలకొచ్చినా కన్నె మేనకా
గుండె గూటిలో పల్లె పాటలా
పల్లవించనా ప్రేమ నాయకా
ఎపుడమ్మా మధుమాసం
ఎదురవదా మనకోసం
చిలకరెక్కపై లగ్నపత్రికా
రాయమన్నదీ గండుకోయిలా

చెలియా చినుకై నిను తాకాలనీ
సఖియా వెలుగై నిను చేరాలనీ
ఎగసే మనసే నీకివ్వాలనీ
వరసే కలిసే తోడవ్వాలనీ
కౌగిళ్ళలో కలే పండాలనీ
నూరేళ్ళిలా మనం ఉండాలనీ
అగ్నిసాక్షిగా ఏడు అడుగులూ
వేయమన్నదీ వేదమంత్రమూ

తెలుసా వయసా తొలి వలపన్నదీ
ఎదలో లయలా అది దాగున్నదీ
వినవా మనసా తను ఏమన్నదీ
కనులే కలిపి మైమరపన్నదీ
నా ఆశలే ప్రియా తీరేదెలా
నీ శ్వాసగా చెలీ మారేదెలా
వాన చినుకులే తలంబ్రాలుగా
పోయమన్నదీ మేఘమాలికా

No comments:

Post a Comment