ప్రియ వసంత గీతమా
వన మయూర నాట్యమా
కుహు కుహుల రాగమా
మృదుస్వరాల నాదమా
అరవిందాలయాన పరచుకున్న శాంతమా
పెదవుల మూగ బాసలెరిగిన ఏకాంతమా
అందుతున్న అందమా పొందికైన బంధమా
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
చిలిపి ఊహ వెనక తరుముతుంటే
ఆకాశవీధి స్వాగతించెలే
వలపు యాత్ర సాగిపొతు ఉంటే
మేఘాల వాడ విడిది చూపెలే
సుదూర స్వప్న సీమ సమీపమే సుమా
జపించి జంట ప్రేమ జయించి చేరమా
పరవశమా పరుగిడుమా
అరవిందాలయాన పరచుకున్న శాంతమా
పెదవుల మూగ బాసలెరిగిన ఏకాంతమా
అందుతున్న అందమా పొందికైన బంధమా
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
ఉక్కపొసే వేళలో ఊటీ చలో చలో
ఎండ కౌగిలి చేరినా అమ్మో అదెం చలో
ఇలాంటి హాయి నాకు ఇంతవరకు లేదుగా
ఈవేళ అందులోన వింత చూడు కొత్తగా
చేయిచాచి చేరదీసి చూపవమ్మా
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
ప్రియ వసంత గీతమా
వన మయూర నాట్యమా
కుహు కుహుల రాగమా
మృదుస్వరాల నాదమా
No comments:
Post a Comment