నగుమో ఈ సుఖమో సిగ్గువీడమ్మో
ముద్దులివ్వబోతె మేనుపులకగ
నగుమో ఈ సుఖమో సిగ్గులేలమ్మో
ముద్దులివ్వబోతె అధరం బెదరగ
వెండి అందియలు ఘల్లు ఘల్లుమన
గుండె అంచులలో ఝల్లు ఝల్లుమన
ముద్దులివ్వగ నీవునీతములు మనసు కలచివేసే
అణువు అణువున నన్ను తలచుకొని
తనువు నిలువున నన్ను హత్తుకొని
ముద్దులివ్వగ రెచ్చిపోయి చెలి పెదవి కొరికివేసే
నిజమా నిజమే గాయమా చూడుమా
రిరిగ పపగ రిరిగ పపగ గరిస రిసని సనిద పదసరి
కలువలు విరియును చలువరేయిలో
మల్లెలువిరియును సంధ్యవేళలో
మగువలు విరిసే ఘడియలేవిటో తెలియచెప్పగలవా
బొటనవేలితో ముద్దులేయగా
కన్నుల రెప్పలు సగము మూయగా
కాళ్ళ గొలుసుల తాళం మారగ మగువ విరియునమ్మా
అవునా అవునూ కానుకా ఇదిగో
రిరిగ పపగ రిరిగ పపగ గరిస రిసని సనిద పదసరి
No comments:
Post a Comment