04 June 2010

ఉప్పెనంత ఈ ప్రేమకి

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి
ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దురానికే
విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్ళకి
లోకమంతా ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకి
ఇన్ని శిక్షలెందుకో

ఐ లవ్ యు
నా ఊపిరి ఆగిపోయిన
ఐ లవ్ యు
నా ప్రాణం పోయిన ||ఐ లవ్ యు ||

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

కనులలోకి వస్తావు
కలలు నరికేస్తావు
సెకన్డుకూసారైన చంపేస్తావు
మంచులా ఉంటావు
మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి
పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకే ముళ్ళులా మరి
గుండెల్లో సరాసరి

ఐ లవ్ యు
నా ఊపిరి ఆగిపోయిన
ఐ లవ్ యు
నా ప్రాణం పోయిన

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చేయన
చిలకలే నీ పలుకు
తిరిగి పలికయంటే
తొలకరే లేకుండా పాతేయన
నిన్ను కోరి పూలు తాకితే
నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే
తోడేస్తా ఆ కళ్ళనే

ఐ లవ్ యు
నా ఊపిరి ఆగిపోయిన
ఐ లవ్ యు
నా ప్రాణం పోయిన ||ఐ లవ్ యు||

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

No comments:

Post a Comment