13 February 2010

పువ్వులో గువ్వలో వాగులో తీగలో

పల్లవి; పువ్వులో గువ్వలో వాగులో తీగలో
అంతట నీవే నమ్మ అన్నిట నీవే నమ్మ
నీ వొడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చుసుకోవమ్మ అమ్మ
కొమ్మ కొమ్మ ఫై కుసుమంలో
కమ్మని తేనెవు నీవే నీవే
జాలి గుండెతో జల జల పారే సెలయేరువు నీవే
నింగిలో నేలలో రంగు రంగుల హరి విల్లులో (అంతట నీవే )


చరణం1; సీత కోక చిలుకలతో చేరి వసంత లాడేను
బంగారు వన్నెల జింకలతో
చెంగు చెంగున ఎగిరెను
కొండలో కొనలో తోటలో బాటలో (అంతట నీవే )


చరణం2; నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగ జీవులే నా వాళ్ళు
అంతు లేని ఈ అందాల లోకం అంట నాదే నమ్మ
మనసులో మమతలో కనులలో నా కలలలో (అంతట నీవే )

No comments:

Post a Comment