12 May 2010

ఒహో లైలా ఓ చారు శీల కోప మేలా

ఒహో లైలా ఓ చారు శీల కోప మేలా
మన కేలా గోళ మందార మాల మాపటెళా
మిస మిస వయసు రుస రుసల దరువుల గుస గుస తెలుసు కలికి చిలక
కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలుసు కవిని గనక
||ఒహో

౧|| విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా
హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా
వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాలా
విరించినా వలపుల్లొన విరించనీ రాయాలా
అంద చందాల అతివాల్లోన కోపమే రూపమా
కోప తాపాల మగువల్లోన తప్పనీ తాళమా
చాల్లే బాల నీ జాడ్య శీల సంధ్యా రాగాలాపన ||ఒహో

౨|| జపీంచినా మంత్రం నీదే తపించినా స్నేహం లో
ప్రపంచము స్వర్గం నీదే తపించిన ప్రేమల్‌లో
చెలి సఖి అంటూ నీకై జ్వలించినా ప్రాణం లో
ఇది కధ అన్నీ తెలిసీ క్షమించవే ప్రాయం తో
కాళ్ళ బేరాల కొచ్చా కైనా కాక లే తీరావా
గేరు మార్చెసి పాహి అన్న కేకలే ఆపవా
పోవే బాల చాలించు గోల ప్రేమిస్తున్న ఘాటుగా ||ఒహో

No comments:

Post a Comment