22 June 2010

ఓ అజంతా వెల వెల బోదా...యల్లోరా తల్లడిల్లదా

ఓ అజంతా వెల వెల బోదా...యల్లోరా తల్లడిల్లదా
కాస్మీరం కలవర పడదా..తాజ్‌మహల్ తడబడి పోదా...
హాయ్ హాయ్..ఆ..ఆ.ఆ..
ఒక వనిత నవ ముదిత సుమ లలిత రస భరిత...||2||
అలిగితే ఏమవుతుంది అందం నాగు పామౌతుంది...
గోరింకా...హ హా గోరింకా...హేయ్...
గోరింకా...హా గోరింకా...

ఆ...కొసవేళ్ళ సవరణ నోచుకున్నా కురులదేమి భాగ్యమో...
ఆ..అడుగుల నునుపు ముద్దాడుకున్నా గడపదెంత సౌభాగ్యమో...ఆఆ
అది కంటి మెరుపో...ఆబ్రహ్మ గెలుపో...||2||
కాకా.. కాకా.. కాకా.. కాకా...
లల్లలా...లల్లలా...లర లా...

అలిగితే ఏమౌతుంది ఉదయమే నడిజామౌతుంది...
గోరింకా...హ హా గోరింకా...హేయ్...
గోరింకా...హా గోరింకా...

ఆ..అలివేణి మోమును చూపిన అద్దానిదెంతటి పుణ్యమో...
ఆ..చెలి నుదుటను ముద్దుగ దిద్దిన తిలకానిదెంతటి లావణ్యమో...ఆఆ
ఆ రంభ రూపం అపరంజి శిల్పం...హ హ ||2||
ఆ చంద్ర వదన ఆ కుందరదన ఆ కమల నయన ఆ కాంతి సదన
నవ్వితే ఏమౌతుంది..నవ్వే నవ్వుకు నవ్వౌతుందీ...

గోరింకా...హే గోరింకా...హ హ...
గోరింకా...హా చాలింకా...హ హహ

No comments:

Post a Comment